FbTelugu

కరోనాతో చనిపోతే వైరస్ ఎన్ని గంటలు ఉంటుందంటే…

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ సోకి చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియలు నిర్వహించేందుకు భార్యా, పిల్లలే ముందుకు రావడం లేదు. కుటుంబ సభ్యులు కూడా దరిదాపులకు రాకుండా మొహం చాటేస్తున్నారు.

దేశంలో 70 శాతం మృతదేహాలను సొంత కుటుంబం కాకుండా బయటి వారు లేదా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. అంతగా భయపడపవద్దని వైద్య నిపుణులు ఎంతగా చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. ప్రజల్లో గూడుకట్టుకున్న ఈ భయాన్ని తొలగించేందుకు ఏయిమ్స్ వైద్యులు నడుం బిగించారు. ఏయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం పాజిటివ్ తో చనిపోయిన మెడికో లీగల్ కేసులను పరీక్షించింది. వందకు పైగా శవాలను పరీక్షించి ఒక నిర్థారణకు వచ్చారు. ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ సోకి చనిపోతే 12 నుంచి 24 గంటల తరువాత అతని శరీరంలో వైరస్ బతకడం లేదని గుర్తించారు. మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. వ్యక్తి చనిపోయిన తరువాత ముక్కు రంధ్రాలు, శరీరం నుంచి ద్రవాలు స్రవించే ప్రదేశాలను మూసివేయాలని సూచించారు. రోగికి అమర్చిన వాటిని శానిటైజ్ చేయాలని పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.