FbTelugu

డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది..? హైకోర్టు

హైదరాబాద్: కరోనా రోగుల సేవలో నిమగ్నమైన డాక్టర్లకు రోగం ఎలా సోకిందో నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణలో కరోనా వ్యాప్తి, పరీక్షలకు సంబంధించిన అంశాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కొందరు డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోకిందని వివరించారు.. డాక్టర్లు, వైద్య సబ్బందికి రక్షణ కిట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వాదనలు విన్న హైకోర్టు, వైద్య సిబ్బందికి కరోనా ఎలా వచ్చిందో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిబ్బందికి రక్షణ కిట్లు (పీపీఈ) ఇచ్చారా..? అసలు ఇస్తే కరోనా ఎలా వచ్చిందని ప్రశ్నించింది. ఈ నెల 8వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో పలువురు వైద్య విద్యార్థులు, వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడిన విషయం విదితమే.

You might also like

Leave A Reply

Your email address will not be published.