FbTelugu

తక్కువ టెస్టులు చేసి కేసులు తక్కువంటే ఎలా ?: ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువ నిర్వహించి కేసులు తక్కువగా నమోదయ్యాయని అంటే ఎలా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు విమర్శలు చేశారు. తెలంగాణలో కరోనా కేసులపై తమకు అనుమానం ఉందని అన్నారు.

తాము ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే.. పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. పైగా ప్రతిపక్షాలపైనే విరుచుకుపడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని 80 శాతం ప్రజలు తినే స్థితిలో లేవని, ఇప్పటికీ ప్రభుత్వ ఆర్థిక సాయం చాలా మందికి అందనేలేదని అన్నారు. కరోనాపై నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.

You might also like