FbTelugu

మల్లన్నసాగర్ బాధితులకు ఊరట: హైకోర్టు

హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని ఒంటరి మహిళలు, పురుషులకు పూర్తి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని. అప్పటి వరకు వారి ఇండ్లను కూల్చకూడదని హైకోర్టు స్పెషల్ గ్రీన్ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఒంటరి మహిళలకు న్యాయం చేయాలంటూ పలువురు వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులలో పిటిషనర్లు తమ ఆధార్ కార్డులను తీసుకొని జిల్లా కలెక్టర్ ముందు హాజరై ఆర్ అండ్ ఆర్ ప్యాకెజీ తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పిటిషనర్లలో ఎవరు లేని వారికి చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, వారికి చెక్కులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం విన్నవించిగా హైకోర్టు అంగీకరించింది. ఈ కేసుకు సంబంధించి జులై 9 న రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.