FbTelugu

మద్యం మత్తులో ఇంటికి నిప్పు… ముగ్గురు మృతి

బెంగళూరు: ఒక ఆకతాయి మద్యం మత్తులో ఒక ఇంటికి తాళం వేసి క్షణికావేశంలో నిప్పంటించడంతో ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు.

కొడగు జిల్లా కనూరు గ్రామంలో ఒక వ్యక్తి తాగిన మైకంలో చేసిన పనికి 8 మంది మంటల్లో చిక్కుకున్నారు. ముగ్గురు సజీవ దహనం కాగా, ఐదుగురు గాయాల పాలయ్యారు. చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.