FbTelugu

దంపతులపై కూలిన మిద్దె

కడప: భార్యాభర్తలపై మిద్దె కూలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని రాజుల పాలెం మండలం కూలురులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సావిత్రమ్మ, శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు భార్యాభర్తలు.

వీరు స్థానిక కూలురులో ఓ మిద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ మిద్దె ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇంట్లోనే ఉన్న దంపతులిద్దరూ మృత్యువాత పడ్డారు.

You might also like