FbTelugu

ఓయులో హాస్టళ్లు, మెస్ మూత

హైదరాబాద్: కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తుండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఇవాల్టి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) హాస్టళ్లతో పాటు మెస్ మూసివేస్తున్నారు.
మధ్యాహ్నం భోజనం సమయం తరువాత మెస్ ల మూసివేత. మధ్యాహ్నం లోపు హాస్టళ్లు ఖాళీ చేయాలని రిజిస్ట్రార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేశారు. సోమవారం నుంచి అమలు చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి పి.సబితా రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా కొన్ని విశ్వ విద్యాలయాలు పరీక్షలను వాయిదా వేశాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తెలియచేస్తామని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.