FbTelugu

గాంధీ ముందు హాస్పిటల్ సిబ్బంది ధర్నా

హైదరాబాద్: గాంధీ హాస్పిటల్ లో ఒకవైపు కరోనా రోగులతో హాస్పిటల్ కిటకిటలాడుతుండగా మరోవైపు నర్సులు, నాలుగో తరగతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు.

నర్సులు తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరితో పాటు నాలుగో తరగతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, శానిటేషన్ వర్కర్లు, సెక్యురిటి గార్డులు, పేషెంట్ కేర్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఈరోజు విధులు బహిష్కరించారు.
హాస్పిటల్ ప్రధాన గేటు ముందు రోడ్డు పై కూర్చుని ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మంత్రులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

You might also like