FbTelugu

హాస్పిటల్ తనిఖీ చేసిన మంత్రి

విజయవాడ: విజయవాడ హాస్పిటల్ లో సౌకర్యాలు పరిశీలించి ఫుడ్, వసతులపై తనిఖీ చేశామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

కోవిడ్ హాస్పిటల్స్ లో డాక్టర్లు సమర్ధవంతంగా సేవలు అందిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో విమర్శలు వస్తున్నాయని నాని తెలిపారు. గత నాలుగు నెలల నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తున్నదని అన్నారు. లాక్ డౌన్ సడలింపులతో రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వసతులు, డాక్టర్ల సేవలు, ఆహారం పై పేషేంట్స్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడ్డం జరిగిందన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై పేషేంట్స్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ప్రతి కరోనా రోగికి రోజుకు రూ.500 వెచ్చిస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా సంతృప్తికరంగా సేవలు అందుతున్నాయా లేదా అనేది విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో ఇవాళ పరిశీలించామన్నారు. కేవలం విజయవాడ హాస్పిటల్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోవిడ్ హాస్పిటల్స్ పరిశీలిస్తామన్నారు. ఫుడ్ కాంట్రాక్ తీసుకున్న వారు నాణ్యమైన భోజనం అందించాలని, లేకపోతే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. వేలాది మంది కోవిడ్ పేషేంట్స్ ఉన్నారు.. చిన్న చిన్న లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే సరిదిద్దుకుంటామని మంత్రి నాని తెలిపారు.

You might also like