FbTelugu

ఇండియాకు షాకిచ్చిన హాంకాంగ్

ఎయిరిండియా విమానాలపై నిషేధం

ఢిల్లీ: హాంకాంగ్ ప్రభుత్వం ఇండియాకు గట్టి షాకిచ్చింది. ఇండియా నుంచి వచ్చే విమానాలను నిషేధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు హాంకాంగ్ లో అడుగుపెట్టవద్దని స్పష్టం చేసింది.

వందే భారత్ మిషన్ లో భాగంగా ఇండియా ఇతర దేశాలకు విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ రావడంతో హాంకాంగ్‌ ప్రభుత్వం విమానాల రాకపోకలను నిషేధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు హాంకాంగ్ ప్రటించింది. ఈ నెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులకు కరోనా ఉంది. ఈ ఐదుగురు కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్టుగా వెల్లడైంది.
కరోనా నెగిటివ్ సర్టిఫికెట్‌తో ప్రయాణం చేసిన వీరికి అక్కడ జరిపిన పరీక్షల్లో కరోనా పాజటివ్ గా నిర్ధారణ జరిగింది. ఇండియా కచ్చితమైన పరీక్షలు నిర్వహించకుండా పంపిస్తున్నారని అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 3 వరకు రెండు వారాల పాటు నిషేధాన్ని విధిస్తున్నట్టు హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.