FbTelugu

హానీట్రాప్… 3వేల మంది లొంగదీసుకున్నాడు

విజయనగరం: అమ్మాయిలు అనగానే లొట్టలేసుకుని పరుగులు పెడతారు. వెనకా ముందూ ఏమీ ఆలోచించరు. ఇద్దరు కలిసి చేసిన మోసానికి ఇప్పటి వరకు మూడు వేల మంది జేబులు ఖాళీ చేసుకున్నారు.

ఎట్టకేలకు ఒకరు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో వీరి గుట్టురట్టయింది. దీనికి సంబంధించిన వివరాలు టూ టౌన్ సీఐ సీహెచ్.శ్రీనివాస రావు వెల్లడించారు. అశ్విన్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం విజయనగరం వచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే ఆయనకు సింధూ అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. భార్యతో పాటు ప్రేయసి సింధూను పోషించడం కష్టంగా మారడంతో కొత్త ఉపాయం ఆలోచించారు.

ఆన్ లైన్ సెక్స్ పేరుతో లొకాంటో యాప్ ద్వారా పలువురికి వల వేయడం మొదలు పెట్టారు. కస్టమర్ల స్థాయిని బట్టి రూ.500 నుంచి రూ.8వేల వరకు వసూలు చేసేవాడు. ఆన్ లైన్ లో డబ్బులు ట్రాన్స్ ఫర్ అయిన తరువాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేవాడు. ఇలా ఇప్పటి వరకు వీరి చేతిలో మూడు వేల మంది దాకా మోస పోయారు. ఆన్ లైన్ సెక్స్ కావడంతో ఎవరూ కూడా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీన్ని అవకాశంగా మలుచుకుని దండుకుంటున్నారు.

అయిదు రోజుల క్రితం నరేశ్ రెడ్డి అనే వ్యక్తి ఆన్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టౌన్ టౌన్ పోలీసులు విచారించగా అశ్విన్, సింధూ గుట్టు రట్టయింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ తెలిపారు.

You might also like