FbTelugu

మహారాష్ట్రలో ఇంటింటికి పరీక్షలు

ముంబై: కుష్టు, క్షయ కేసుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించింది.
మంగళవారం నుంచి ఈ స్క్రీనింగ్ ప్రారంభించింది.

ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల బృందం, ఇతర కార్మికులతో పాటు ప్రతి రోజు 20 గృహాలను సందర్శించనున్నారు. అనుమానాస్పదంగా కన్పించే వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. కుష్టు, క్షయ కేసులను పూర్తిస్థాయిలో నిర్మూలించాలనే యోచనతో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.