FbTelugu

18 నుంచి ఝార్ఖండ్ లో ఇంటింటి సర్వే

రాంచి: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఈనెల 18వ తేదీ నుంచి ఇంటింటి సర్వే నిర్వహించాలని ఝార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.

పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ తీవ్రత పెరిగింది. నియంత్రించేందుకు ఇంటింటి సర్వే చేయడమే ఏకైక మార్గంగా భావించింది. 18 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి, నమూనాలు సేకరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శ నితిన్ కులకర్ణీ తెలిపారు.

వారం రోజుల పాటు కొనసాగే సర్వేలో బీపీ, టీబీ, క్యాన్సర్, డయాబెటిక్, డయాలసిస్, శ్వాసకోస వ్యాధి సమస్యలు ఉన్నవారి నుంచి నమూనాలు సేకరిస్తారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో ఐసీఎంఆర్ సర్వే జరుపుతోందని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఇప్పటికే ఝార్ఖండ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

You might also like