FbTelugu

క్రిస్మస్ రోజున ఇళ్ల స్థలాలు

తాడేపల్లి: ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ రోజున ఇళ్ల స్థలాల పంపిణీ, 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమం జనవరి 7వ తేదీ వరకు కొనసాగనున్నది.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 8,914 ఇళ్ల చొప్పున పనులు ప్రారంభం కానున్నాయి.

రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 30.75 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తుండగా, 3,65,987 ఇళ్ల స్థలాలపై కోర్టు కేసులు ఉన్నాయి. ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ చేశారు. రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తున్నారు.
కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించనున్నది. 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కేవలం రూ.1 కే ప్రభుత్వం ఇవ్వనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.