FbTelugu

సురభి వాణికి ఓటేశా…: హోం మంత్రి

హైదరాబాద్: రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ నోరు జారారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ఎవరికి ఓటు వేసింది ఆయన బహిరంగంగా వెల్లడించారు.

ఇవాళ హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఓల్డ్ మలక్ పేటలని అగ్రికల్చర్ ఆఫీసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి మేడమ్ కు ఓటేశానని ప్రకటించారు. బహిరంగంగా ప్రకటించడంతో ఆయన ఓటును చెల్లని ఓటుగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరికి ఓటు వేసింది బహిరంగంగా ప్రకటించకూడదు. అలాగే పోలింగ్ బూత్ లో ఓటు వేసే సందర్భంలో చూపించకూడదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.