FbTelugu

హోం మంత్రి కిషన్ పాదయాత్ర… ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు!

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పాదయాత్ర మూలంగా రామంతపూర్ నుంచి గోల్నాక వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం పూట కావడంత వాహనదారులు నానా కష్టాలు పడ్డారు. పలువురు ఆఫీసు టైము అయిపోతుందంటూ గగ్గోలు పెట్టారు.

తను అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ అంబర్ పేట నియోజకవర్గంపై కిషన్ రెడ్డి మమకారం చంపుకోవడం లేదు. గోల్నాక నుంచి రామంతపూర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నారు. పనులను పరిశీలించేదుకు మార్గం పొడవునా ఇవాళ కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బిజెపి కార్యకర్తలు కరోనా నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా చేరుకున్నారు. ఇదేం పద్దతి అంటూ అటుగా వెళ్లే వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.