FbTelugu

హోం మంత్రి అనిల్ కు ఉద్వాసన?

ముంబయి: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఆయనపై ముంబయి పోలీసు మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఆరోపణలపై విచారించి, పదవిలో కొనసాగించాలా లేదా తీసివేయాలా అనేది ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేయడంతో మరింత వేడెక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వ కూటమిలోని పార్టీలు సోమవారం నాడు న్యూఢిల్లీలో సమావేశం అయి నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఈ సమావేశంలో ఆయన భవితవ్యం తేల్చనున్నారు. అయితే హోం మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్ ముఖ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నిరాధార ఆరోపణలు చేసిన పరంబీర్ సింగ్ పై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.