FbTelugu

పాపం… బాత్రూమ్ లోనే హోం ఐసోలేషన్!

వికారాబాద్: కరోనా వైరస్ మనుషులను ఎంతగా వేధిస్తున్నదనేదానికి ఇదొక ఉదాహారణ మాత్రమే. తన మూలంగా భార్యా, పిల్లలకు కరోనా పాజిటివ్ సోకుతుందనే భయంతో ఒకరు బాత్రూమ్ లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా అధికారులు సంప్రదించి కరోనా కేర్ సెంటర్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం లోని మైలారం లో అశోక్ (30) నివాసం ఉంటున్నాడు. ఐదు రోజుల క్రితం అతనికి పాజిటివ్ అని తేలింది. చికిత్స కోసం మందులు తీసుకున్న అశోక్ ఇంట్లో ఉండే బదులు బాత్రూమ్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తనకు రెండు ఇళ్లు ఉన్నప్పటికీ బాత్రూమ్ సేఫ్ అని నిర్ణయానికి వచ్చాడు. గురువారం ఉదయం తన స్థితిపై సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. బాధితుడి వివరాలు తెలుసుకుని అనంతగరి గుట్టలోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.