FbTelugu

విడాకులు కోరిన హాలీవుడ్ కపుల్

వాషింగ్టన్: హాలీవుడ్ స్టార్ కపుల్ కిమ్ కర్ధాషియన్, కేన్ వెస్ట్ విడిపోయేందుకు సిద్ధమయ్యారు. విడాకులు కోరుతు కిమ్ న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఈ కపుల్ విడాకులు తీసుకుంటున్నారంటూ కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కథనాలను నిజం చేస్తూ కిమ్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఇది కేన్ కు మొదటి విడాకులు కాగా, కిమ్ కు మాత్రం మూడో విడాకులు కావడం గమనార్హం. ఏడేళ్ల వివాహం బంధం తెంచుకునేందుకు పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు.
కొంత కాంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కిమ్ తన నలుగురు పిల్లలో లాస్ ఏంజెల్స్ లో ఉంటుండగా, కేన్ వోమింగ్ లో ఒంటరిగా నివసిస్తున్నాడు. నలుగురు పిల్లల్ని మాత్రం ఉమ్మడి కస్టడీలో పెట్టాలని కోర్టును కోరారు. ప్రముఖ టీవీ రియాలిటి షో లో వీరిద్దరి దగ్గరయ్యి, డేటింగ్ చేసి వివాహం చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.