FbTelugu

ఇవాల్టి నుంచే జూనియర్ కాలేజీలకు సెలవులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జూనియర్‌ కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో నేటి నుంచి అన్ని జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఇవ్వక తప్పలేదు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పరీక్షల నిర్వహణపై పునఃపరశీలన చేయాలని ఏపి హైకోర్టు ఆదేశించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పట్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు మే నెల 3వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఎండలు కూడా మండుతుండడంతో సెలవులు ఇచ్చారు. తిరిగి పరీక్షల తేదీలు ప్రకటించే వరకూ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఏపి ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.