FbTelugu

గుజరాత్ లో హోలీ వేడుకలు రద్దు

అహ్మదాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది హోలీ వేడుకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఇవాళ ప్రకటించారు.

హోలీ వేడుకలకు అనుమతించనప్పటికీ హోలికా దహన్ కార్యక్రమానికి తక్కువ మందితో చేసుకునేందుకు అనుమతించామని ఆయన వెల్లడించారు. గుంపులు గుంపులుగా ప్రజలు చేరుకోవడం, రంగు చల్లుకోవడం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని, అలా చేస్తే కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, కరోనా ఉధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని నితిన్ పటేల్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.