FbTelugu

కళ్లలో కారం కొట్టి.. కత్తులతో దాడి

హైదరాబాద్: ఓ కిరాణషాపు యజమానిపై కొందరు దుండగులు కళ్లలో కారం కొట్టి, కత్తులతో దాడికి పాల్పడిన ఘటన నగర శివారులోని హయత్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజన్ రెడ్డి అనే కిరాణా షాపు యజమానిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కాలం కొట్టి షాపులోనే కత్తులతో దాడికి పాల్పడ్డి వెళ్లిపోయారు.

అంజన్ రెడ్డి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఊరినుంచి వచ్చిన అతని కుటుంబ సభ్యులు షాపుకు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like