FbTelugu

హిస్టరీ బ్రేక్… మేడారాన్ని చుట్టేసిన జంపన్నవాగు

ములుగు: చరిత్రలో తొలిసారి మేడారం గ్రామాన్ని జంపన్న వాగు వర్షపునీటితో చుట్టేసింది. సమ్మక్క, సారాలక్క గద్దెల సమీపంలోని ఐటీడీఏ కార్యాలయం వరకు వరదనీరు చేరుకున్నది.

గత మూడు రోజులుగా ఎడతెరిపిని ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. నీటి ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాలలో వాహనాల రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే. వరదల కారంగా అధికార యంత్రాంగం పస్రా నుంచి మేడారం వరకు రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలిపివేశారు.

వరదలతో మేడారం గ్రామం బ్రిడ్జీపై నుంచి గ్రామంలోకి వర్షపునీరు చేరుకున్నది. ఇలాగే వర్షాలు కురిస్తే కొద్ది సేపట్లోనే సమ్మక్క, సారాలక్క అమ్మవార్ల గద్దెలను కూడా నీరు తాకే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే చిలకలగుట్టను తాకి గద్దెల వైపునకు వర్షపునీరు పయనిస్తున్నది.

You might also like