FbTelugu

ఆ రాయి కదిపాడు… యుద్దం జరగలేదు!

బ్రుసెల్స్: పొలం పనులకు అడ్డుగా ఉందని ఒక రైతు దేశ సరిహద్దు రాయినే పక్కకు జరిపాడు. రైతు తనకు తెలియకుండా పెద్ద పొరపాటు చేశాడు. ఇలా తొలగించడం మూలంగా రెండు దేశాల మధ్య యుద్దం జరగాలి కాని జరగలేదు.
బ్రెజిల్ కు చెందిన రైతు కొద్ది రోజుల క్రితం తన పొలానికి ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. పనులు చేసుకుంటుండగా సరిహద్దు రాయి అడ్డుగా వస్తుండడంతో చికాకు పడ్డ ఆయన పక్కకు జరిపాడు.

రెండు రోజుల తరువాత చరిత్రకారులు అటువైపుగా వచ్చి చూడ్డంతో రాయి మూడు మీటర్ల దూరం వరకు పక్కకు జరిగి ఉంది. ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా ఫ్రాన్స్ భూభాగంలోకి జరిగి ఉంది. ఈ రాయిని 1989లో పాతి పెట్టారు. రైతు చర్య మూలంగా బెల్జియం పెద్దది అయిందని, ఫ్రాన్స్ చిన్నది అయిందని చరిత్రకారుడు డేవిడ్ లావాక్స్ తెలిపారు. మా దేశం పెద్దది అయినందుకు సంతోషంగా ఉన్నా, ఇది సరికాదని అన్నారు. ఫ్రాన్స్ లోని భౌసిగ్నీస్ మేయర్ కూడా దీనికి ఒప్పుకోనందున మళ్లీ యధాస్థానంలో పెట్టాలని నిర్ణయించాం. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదని, లేదంటే యుద్దాలకు దారితీసేదని ఆయన వ్యాఖ్యానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.