FbTelugu

ఆయన భార్య, ఈమె భర్త కలిసి పరార్!

హైదరాబాద్: జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో విచిత్రమైన కేసు నమోదు అయింది. ఒక వ్యక్తి తన భార్య మరొకరితో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు. మరో మహిళ వచ్చి తన భర్త కన్పించడం లేదంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది.
రెండు ఫిర్యాదులకు దగ్గరగా సంబంధం ఉండడంతో పోలీసులే ఆశ్చర్యపోయి విచారించారు. పశ్చిమ బెంగాల్ కొలకతాకు చెందిన బి.నారాయణ దాస్, మోనికా దాస్ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి వెంకటగిరిలో ఉంటున్నారు. నారాయణదాస్ ప్లంబర్ గా పనిచేస్తున్నాడు.

ఏడాది కాలంగా మహ్మద్ ఆసిఫ్ అనే యువకుడితో తరచూ ఫోన్ లో మాట్లాడుతున్నది. ఈ విషయాన్ని గమనించిన భర్త ఆమెను మందలించాడు. కుల పెద్దలు కూడా సర్ధి చెప్పడంతో గొడవ సద్దుమణిగి కాపురం చేసుకుంటున్నారు. ఈ నెల 24వ తేదీన భర్త ఇంట్లో లేని సమయంలో మోనికా దాస్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని కొలకతా వెళ్లిపోయింది. పిల్లలను తల్లి వద్ద విదిలేసి వెళ్లినట్లు భర్తకు తెలిసింది. ఆసిఫ్ తో కలిసి వెళ్లినట్లు తెలియడంతో భర్త నారాయణ దాస్ ఆదివారం జుబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేరోజు సాయంత్రం ఆసిఫ్ భార్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చింది. తన భర్త కన్పించడం లేదని తెలిపింది. రెండు ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.