FbTelugu

పుడమి ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుంది

వంగపండును కొనియాడిన మంత్రులు

విజయనగరం: ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి ఉత్తరాంధ్ర లోని పేదలు, అట్టడుగు వర్గాల వారికి లోటు అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వంగపండు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధర్మాన హామీ ఇచ్చారు.
ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబ సభ్యులను పార్వతీపురంలో పరామర్శించి ఆయన చిత్రపటానికి మంత్రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండు అని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కొనియాడారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన పాట, మాట ఈ పుడమి వున్నంత కాలం చిరస్థాయిగా నిలిచి వుంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.

అట్టడుగు వర్గాల, గిరిజనుల గొంతుక గా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి వాటి పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి అని ఆయన కీర్తించారు. వంగపండు కుమార్తె ఉష, కుమారుడు దుష్యంత్, భార్య విజయలక్ష్మి లకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ తరపున సంతాపం తెలియచేశారు.

You might also like