FbTelugu

ఎంపీ అసదుద్దీన్ బ్లాక్ మెయిలర్: నౌహిరా షేక్

హైదరాబాద్: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక బ్లాక్ మెయిలర్ అని హీరా గ్రూప్ ఛైర్ పర్సన్ నౌహిరా షేక్ సంచలన ఆరోపణలు చేశారు. మహిళలు, యువతుల సాధికారికత కోసం రెండు దశాబ్ధాలుగా పనిచేస్తున్న తమ సంస్థపై కేసుల వెనక అసదుద్దీన్ హస్తం ఉందన్నారు.
తమ సంస్థ వెనక ఉన్న కుట్రదారుల గురించి నౌహిరా షేక్ మీడియాకు వివరించారు. హీరా గ్రూప్ సంస్థలు కుంభకోణానికి పాల్పడ్డాయంటూ ఎంఐఎం నాయకులు అసత్య ప్రచారానికి పాల్పడ్డారన్నారు. తమకు తెలంగాణలోనే రూ.5వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని వివరించారు. అసదుద్దీన్, ఆయన అనుచరులు గత తొమ్మిది సంవత్సరాలుగా తమను వేధింపులకు గురి చేస్తున్నారని, డబ్బులు ఇవ్వాలంటూ తరచూ బ్లాక్ మెయిల్ చేశారని ఆమె ఆరోపించారు.

రూ.20 కోట్లు ఇస్తారా లేదా ఫలానా స్థలం అప్పగిస్తారా అంటూ ఫోన్ చేసేవారన్నారు. వారి బెదిరింపులకు తలవంచకపోవడంతో కక్ష పెంచుకుని తనను జైలు పాలు చేశారన్నారు. పార్లమెంటులో అసదుద్దీన్ మాట్లాడుతూ, తమ గ్రూపు రూ.50వేల కోట్ల కుంభకోణం అని ఆరోపించారని, ఒక్కరైనా రూ.50 లక్షలు నష్టపోయారని ఫిర్యాదు చేశారా అని ఆమె ప్రశ్నించారు.
టోలిచౌకిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదీనంలో ఉన్న భూముల్లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు ఎవరివని ఆమె ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న భూముల్లో భారీ భవనాలు ఎవరు కట్టారో తేల్చాలని నౌహిరా షేక్ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.