FbTelugu

విశాఖ మృతుల బంధువుల ధర్నా

విశాఖపట్నం: నగంరలోని హిందూస్థాన్ షిప్ యార్డ్ ప్రధాన ద్వారం ఎదుట మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు.
తక్షణమే న్యాయం చేయాలి, నష్ట పరిహారం తక్కువగా చెల్లిస్తున్నారంటూ నినాదాలు చేశారు.

ప్రధాన గేటు ముందే కూర్చుని ఆందోళన చేపట్టడంతో సెక్యురిటీ సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ధర్నా చేయవద్దని చెప్పడంతో సెక్యురిటీ సిబ్బందితో మృతుల బంధువులు గొడవపడ్డారు. మాటామాట పెరడంతో బాహాబహీకి దిగారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేయడంతో వారు అక్కడకు చేరుకుని చెదరగొట్టారు.

You might also like