FbTelugu

ఏపి గవ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముఖ్యాంశాలు

అమరావతి: ఆర్థిక వ్యవస్థపై కరోనా దుష్ప్రభావం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇవాళ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి వర్చుల్ విధానంలో ప్రసంగించారు.

– దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది
– సెకండ్ వేవ్ లో మ‌ర‌ణాలు ఎక్కువుగా ఉన్నాయి
– దేశంలో క‌రోనా సంక్షోభం కొన‌సాగుతోంది
– కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌కు కొన‌సాగించాం
– కోవిడ్ నివార‌ణ‌లో ఏపీ దేశానికే ఆద‌ర్శం
– క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చాం
– ఆరోగ్యశ్రీ‌కి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 50శాతం బెడ్లు
– 900 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ కావాల‌ని కేంద్రాన్ని కోరాం
– అద‌నంగా కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నాం
– ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు నా సెల్యూట్
– క‌రోనా వ‌ల్ల మ‌రోసారి ఆర్ధిక రంగంపై తీవ్ర ప్ర‌భావం
– ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా 95శాతం హామీలు పూర్తి చేశాం
– న‌వ‌ర‌త్నాలు ద్వారా ల‌బ్ధిదారుల‌కే నేరుగా సాయం
– ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం.
– ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశాం.
– ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్‌ వచ్చింది.
– ప్రతిరోజూ 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం.
– జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం.
– కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపి ఆర్థిక పురోగతిని కనబరిచింది.
– 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్‌ ఉండగా ఏపి 1.58 శాతం అభివృద్ధి రేటు.
– రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం.
– 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తి.
– వాలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ ప‌థ‌కాలు
– 44.5ల‌క్ష‌ల మంది త‌ల్లుల‌కు జ‌గ‌న‌న్న అమ్మ ఒడి
– జ‌గ‌న‌న్న విద్యా కానుక ద్వారా 47ల‌క్ష‌ల మందికి కిట్ లు
– రూ.1600కోట్ల‌తో 36.8ల‌క్ష‌ల మందికి జ‌గ‌న‌న్న గోరుముద్ద‌
– వ‌చ్చే ఏడాది నుంచి సీబీఎస్ విద్యా బోధ‌న‌
– నాడు- నేడు ద్వారా 15వేల స్కూళ్ల‌లో మ‌ర‌మ్మ‌తులు
– అంగ‌న్ వాడీల ద్వారా పిల్ల‌ల‌కు పౌష్టికాహారం
– విద్యాశాఖ‌కు అన్ని ప‌థ‌కాల కింద రూ.25,714కోట్లు కేటాయింపు
– 108,104 అంబులెన్స్ ల సంఖ్య‌ను పెంచాం
– కొత్త మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం
– ఏపీలో 95శాతం జ‌నాభాకు ఆరోగ్‌ాశ్రీ వ‌ర్తిస్తుంది
– 10,778 రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం
– రైతుల‌కు 9గంట‌ల నిరంత‌ర‌ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
– అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతుల‌కు అద‌న‌పు ఆదాయం
– 9250 మొబైల్ వాహ‌నాల ద్వారా ఇంటింటికి రేష‌న్ పంపిణీ
– అర్హులైన వారంద‌రికీ ఇంటి స్‌్లాలు ఇచ్చాం
– పేద‌ల‌కు రెండు ద‌శ‌ల్లో ఇళ్లు నిర్మించి ఇస్తాం
– పెన్ష‌న్ల కింద ప్ర‌తి నెల 1వ తేదీనే రూ.1407కోట్లు సాయం
– వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 419కోట్ల సాయం
– 45ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల‌కు రూ.15వేలు సాయం
– సాగునీటి ప్రాజెక్టుల‌కు పూర్తికి అధిక ప్రాధాన్యత‌
– క‌ర్నూలు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తెచ్చాం
– జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌కు రూ.1049కోట్లు కేటాయింపు
– స్కూళ్ల ఆధునీక‌ర‌ణ‌కు రూ.3948కోట్లు కేటాయింపు
– జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌కు రూ.4879.30కోట్లు కేటాయింపు
– అమ్మ ఒడి ప‌థ‌కానికి రూ.13,022కోట్లు కేటాయింపు
– జగనన్న అమ్మఒడి కింద రూ.13,022 కోట్లు
– జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మందికి రూ.1600 కోట్లు చెల్లింపు.
– ఇరిగేషన్‌ కింద 14 ప్రాజెక్టులు పూర్తి చేశాం.
– వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద 2019-20 ఏడాదికి 52.38 లక్షలమంది రైతులకు 17030 కోట్లు కేటాయించాం.
– వైఎస్‌ఆర్‌ కాపు నేస్తంలో 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల మహిళలకు 5 విడతల్లో రూ.75 వేలు.
– ఈ ఏడాది 3.2 వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 491 కోట్లు కేటాయించి 3.27 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం.
– వైఎస్ఆర్ నేతన్న నేస్తం కోసం 390.74 కోట్లు కేటాయించి నేతన్నలకు 81,783 మంది లబ్ధి చేకుర్చాం.
– 56 బిసి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను బీసీలకు వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.

You might also like

Leave A Reply

Your email address will not be published.