FbTelugu

తమిళనాడు, మహారాష్ట్రలో విజృంభణ

ఢిల్లీ: తమిళనాడు, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉథృతి కొనసాగుతోంది. తమిళనాడులో 2532 కేసులు, మహారాష్ట్రలో 3874 కేసులు నమోదు అయ్యాయి.

తమిళనాడులో గడచిన 24 గంటల్లో 2532 కేసులు రాగా, 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 59377 కేసులు నమోదు కాగా, 2583 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి దాకా 757 మంది కరోనాతో మృతి చెందారు.

మహారాష్ట్రలో తాజాగా 3874 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1,28,205 మందికి కరోనా సోకింది. వీరిలో 64,153 మంది కోలుకుని ఇంటికి వెళ్లగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 5984 మంది చనిపోయారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.