FbTelugu

46 ఏండ్లలో అత్యధిక వర్షపాతం ఇదే

ముంబయి: భారత ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబయిలోని కోలాబా ప్రాంతంలో గత 46 ఏండ్లలోనే అత్యధిక వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. గత కొన్ని రోజులుగా ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

రానున్న మరో 24 గంటల పాటూ ముంబయిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. తీవ్రంగా కురుస్తున్న వర్షాలకు అనేక భవనాలు, చెట్లు నేలకూలాయి. అనేక లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే పూర్తిగా జలమయం అయ్యాయి.

You might also like