FbTelugu

అధిక సంతానం.. రూ.1 లక్ష బహుమానం:

ఐజ్వాల్: మిజోరాం ప్రకృతి అందాలకు, చిన్న తెగలకు అత్యంత ప్రసిద్ది చెందినది. రాష్ట్ర విస్తీర్ణం, వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపడా జనాభా లేదు. మిజోల లాంటి చిన్న చిన్న తెగల విషయంలో జనాభా నియంత్రణ సమస్యగా పరిణమించింది.

తెగల జనాభా పెంచేందుకే ఎక్కువ సంతానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు మిజోరాం క్రీడా శాఖ శాఖ మంత్రి రాబర్ట్ రోమవీయ తెలిపారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాలకు రూ.1 లక్ష ప్రోత్సాహం అందచేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ మొత్తాన్ని కూడా తన జేబులో నుంచి కాకుండా తన కుమారుడి కంపెనీ నుంచి చెల్లిస్తానని చెప్పాడు. ప్రభుత్వానికి సంబంధం లేదని వెల్లడించి విమర్శల నుంచి తప్పించుకున్నాడు. అధిక సంతానం కన్న తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి రూ.1 లక్ష నగదు ఇస్తానన్నారు. దీంతో పాటు ఒక ట్రోఫి కూడా బహూకరించి సత్కరిస్తామని మంత్రి రాబర్ట్ ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని చిన్న చిన్న తెగల ప్రజలు మహానందపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.