FbTelugu

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేయొద్దంటూ వేసిన సుమారు 10 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా నూతన సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ నిర్ణయాన్ని తప్పు బట్టలేమని స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పుతో నూతన సచివాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగినట్టైంది. వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్లు తమ వాదనను వినిపించారు. కాగా ప్రభుత్వ పాలసీ విధానాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని, ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వ వాదించింది.

You might also like