FbTelugu

‘21 నుంచి హైస్కూల్ టీచర్లు హాజరవ్వాలి’

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 21వ తేదీ నుండి హైస్కూల్ టీచర్లు స్కూళ్లకు హాజరు కావాలంటూ.. పాఠశాల విద్యా కమిషనర్ స్కూళ్ల నిర్వహణపై ఇవాళ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

అయితే 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పాఠశాలలకు పిలవకూడదని.. వారికి ఇంటి దగ్గరే విద్యను అందించాలని సూచించింది. ఈ నెల(సెప్టెంబర్) 22వ తేదీ నుండి అక్టోబర్ 04వ తేదీ వరకు 1నుంచి 8వ తరగతుల విద్యార్థులు మినహా.. 50శాతం విద్యార్థులు హాజరు కావాలని ఆదేశించింది.

You might also like