FbTelugu

ఏలూరు ఘటనపై హైపవర్ కమిటీ

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఏలూరు వింత వ్యాధి ఘటనపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వింత వ్యాధి ప్రభలడానికి గల కారణాలను అధ్యయనం చేయనుంది. 21 మంది సభ్యులతో ఈ హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కమిటీ చైర్ పర్సన్ గా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉండనున్నారు. కన్వీనర్ గా ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండనున్నారు. ఈ కమిటీ వ్యాధినివారణ చర్యలను కూడా సూచించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.