FbTelugu

కరోనా పై కౌంటర్ వేయాల్సిందే: హైకోర్టు ఆగ్రహం

అమరావతి : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణ చర్యలపై కౌంటర్ దాఖలు చేయకపోవటంపై సీరియస్ అయ్యింది. గత సెప్టెంబర్ లో తోట సురేష్ బాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కరోనా సెకండ్ వేవ్ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకలు, మందుల అంశంపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని పిటీషనర్ ఆరోపించారు. ఈ విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ నెల 27 లోగా అఫిడవిట్ దాఖలు చేయకపోతే ప్రభుత్వంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.