FbTelugu

టెన్త్ పై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 8 వ తేదీ నుంచి పదవతరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.. కాగా పరీక్షల నిర్వహణపై నమోదైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఏవైనా ఇబ్బందులతో పరీక్షలు రాయలేకపోతే ఆగస్టులో సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. సప్లిమెంటరిలో పాసైతే రెగ్యూలర్ పాస్ గానే చూస్తారా అని హైకోర్టు ప్రశ్నించగా.. దీనిపై రేపు సమాధానం చెబుతామని ప్రభుత్వం తెలిపింది. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది.

You might also like