FbTelugu

తెలంగాణ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. గతంలో తాము  జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నెలకొన్న ఆంబులెన్స్ ల వివాదం పై హైకోర్టు లో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో విచారణ కొనసాగింది. ఇతర రాష్టాల నుండి తెలంగాణ కు కోవిడ్ పేషేంట్స్ ఎక్కువగా వస్తున్నారని అడ్వకేట్ జనరల్ బిఎస్.ప్రసాద్ తెలిపారు. ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్నారు. ప్రతి పేషేంట్స్ కు హాస్పిటల్ అడ్మిషన్ ఉండాలని అడుగుతున్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సర్క్యులర్ ఎలా జారీ చేస్తారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి తమ ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని తెలిపింది. విజయవాడ, హైదరాబాద్ మార్గం మొత్తం నేషన్ హైవే కావున, దానిపై కేంద్ర ప్రభుత్వం పైన అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. నిలిపివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. అంబులెన్స్ లను ఆపడానికి తెలంగాణ ప్రభుత్వం కు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు భారత దేశం లో ఎక్కాడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ఇవ్వలేదని హైకోర్టు ఆక్షేపించింది.

ముందస్తు అనుమతి ఉంటేనే తెలంగాణ లోకి ఎంట్రీ అనే ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. సరిహద్దుల్లో అంబులెన్సులు నిలిపివేత పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.