FbTelugu

కేటీఆర్ కు ఎన్జీటీ నోటీసులపై హైకోర్టు స్టే

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్) ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. కేటీఆర్ జన్వాడలో జీవో నెం.111 ను ఉల్లంఘిస్తూ ఫామ్ హౌస్ నిర్మించారంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్జీటీ కేటీఆర్ కు నోటీసులను జారీ చేసింది. అయితే తన వాదనలు వినకుండానే నోటీసులు ఇచ్చారంటూ..

కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై చర్చించిన హైకోర్టు ఎన్జీటీ నోటీసులపై స్టే విధించింది. జన్వాడలో రెండెకరాల్లో నిర్మించిన ఫామ్ హౌజ్ కేటీఆర్ దే అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ చెబుతున్నారే గానీ అది ఎవరిదన్నది ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం.

You might also like