FbTelugu

ఇళ్ల స్థలాల కేటాయింపు జీవోపై హైకోర్టు స్టే

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.107పై హైకోర్టు స్టే విధించింది. రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించటం సరికాదంటూ.. కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధానిలో భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

అయితే ఇక్కడ స్థలాలను దుగ్గిరాల, విజయవాడ, మంగళగిరి వారికి కేటాయించటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అక్కడ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఇళ్ల నిర్మాణం జరిగిందని, దుగ్గిరాల, మంగళగిరి సీఆర్డీఏ పరిధిలోకే వస్తాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి స్పష్టం చేశారు. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు నేడు స్టే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More