FbTelugu

సిఎస్ఐ ఎన్నికలపై హైకోర్టు స్టే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం.. కృష్ణా, గోదావరి డయాసిస్ ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశించింది
చట్టవిరుద్దంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న పిటిషనర్ ఆరోపించగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు విన్పించారు.

గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరుగుతున్నదని పిటీషనర్ తరఫు న్యాయవాది తెలపగా, ఎన్నికలపై మూడు వారాలు స్టే ఇచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీసు కమిషణర్, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రెండు జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.