FbTelugu

చంద్రబాబు విచారణపై హైకోర్టు స్టే

అమరావతి: ఏపీ నూతన రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుపై జరుగుతున్న సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధంచింది.
ఇవాళ ఉదయం నుంచి హైకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై విచారణ జరుగుతున్నది.

వాదనల తరువాత హైకోర్టు చంద్రబాబు పై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. అసైన్డు భూముల పై స్పష్టమైన ఆధారాలు చూపించాలని కోరగా, పూర్తి విచారణ జరిగితే కాని వెలుగులోకి రావని సీఐడీకి తెలిపింది. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని హైకోర్టు ప్రశ్నించగా, విచారణ తొలిదశలో ఏమీ చెప్పలేమని సీఐడీ తెలిపింది. ఇరు వర్గాల వాదనల తరువాత చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.