FbTelugu

ఏపీ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే

అమరావతి: ఏపీలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ టిడిపి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్ పై వాదోపవాదనల తరువాత ఇవాళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి పోలింగ్ కు మధ్య నాలుగు వారాల కోడ్ అమల్లో ఉండాలి. ఏప్రిల్ 1 న రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసి) ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ కు, కోడ్ కు మధ్య 4 వారాల గడువు పాటించలేదని టిడిపి తరఫున వాదించిన అడ్వకేట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 4వారాల కోడ్ అమలు కాలేదని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలన పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఏప్రిల్ 8న జరగాల్సిన 7258 ఎంపిటిసి, 516 జెడ్పిటిసి పోలింగ్ వాయిదా వేయాలని ఎస్ఈసిని ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసి లు బుధవారం హౌస్ మోషన్ దాఖలు చేయనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.