FbTelugu

రాజధానుల బిల్లు పై హైకోర్టు స్టేటస్ కో

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ఏపీ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ జారీ చేసిన గెజిట్ పై హైకోర్టు స్టే విధించింది. అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు పై ఆగస్టు 14 వరకు స్టే వర్తిస్తుందని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. మూడు రాజధానులపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించగా, పది రోజులు సమయం కోరిన ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణ ఆగస్టు14 వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయని పక్షంలో స్టేటస్ కో కొనసాగుతుందని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.ష్టం చేసింది.

You might also like