FbTelugu

సిఎం జగన్ కు హైకోర్టు షాక్

అమరావతి: మాజీ కేంద్ర మంత్రి, టిడిపి నాయకుడు పి.అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై ఏపి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ దేవస్థానానికి, మాన్సాస్ ట్రస్ట్ కు ఆయనే చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం అశోక్ గజపతి రాజును తొలగిస్తూ గతంలో జరీచేసిన జిఒఎంఎస్ నెంబర్ 72ను హైకోర్టు కొట్టివేసింది. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ దేవస్థానం చైర్మన్ గా సంచయిత ను తొలగించింది. గతేడాది మార్చి నెలలో సింహాచల దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా ఆనందగజపతి రాజు రెండో కుమార్తె సంచయిత ను ప్రభుత్వం నియమించింది. ఆ మరునాడే విజయనగరం రాజుల ఆధీనంలోని ట్రస్టు బోర్డు చైర్మన్ గా ఆమెను నియమించడంతో అసలు వివాదం మొదలైంది. మాన్సాస్ ట్రస్టు పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు రూ.50వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.