FbTelugu

హైకోర్టు సీరియస్… నైట్ కర్ఫ్యూ పై ఆదేశాలు!

కెసిఆర్ కు కరోనా సోకడంతో అప్రమత్తం

మే 1వ తేదీ వరకు అమలు

కర్ఫ్యూలో కొందరికి మినహాయింపులు

హైదరాబాద్: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచే అమలులోకి రానున్నది. మే 1వ తేదీ వరకు అమలులో ఉండనున్నది.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు సోమవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 48 గంటల్లో ఆంక్షలు అమలు చేస్తారా లేదా మేమే ప్రత్యక్షంగా కార్యాచరణలోకి దిగాలా అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు జరపాల్సిందేనని స్పష్టం చేసింది. సిఎం కెసిఆర్ కు సోమవారం సాయంత్రం కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. అయితే నిన్ననే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కర్ఫ్యూ ఉండదని వరంగల్ లో మరోసారి స్పష్టం చేశారు. హైకోర్టు సీరియస్ కావడంతో ప్రభుత్వం 24 గంటలు గడువక ముందే  చర్యలు చేపట్టింది.

నైట్ కర్ఫ్యూ నుంచి మీడియా ప్రతినిధులు, పెట్రోల్ బంకులు, ఈ కామర్స్, ప్రైవేటు సెక్యురిటీ, నిత్యావసర సరకుల రవాణ, మెడికల్ షాపులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బంది, అత్యవసర సర్వీసులకు మినహాయింపు నిచ్చారు. పబ్బులు, బార్లు, క్లబ్బులు, స్విమ్మింగ్ ఫూల్స్, మాల్స్ మూతపడనున్నాయి. ఐటి, ఐటి సంబంధిత సర్వీసులకు మినహాయింపునిచ్చారు. దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటల వరకే తెరిచి ఉంచాలని ఆదేశాల్లో పేర్కాన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.