FbTelugu

అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష

అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు బాలకృష్ణమా చార్యులు కోర్టులోనే కూర్చోవాలని ఆదేశించింది.

హైకోర్టు ఆవరణలో కూర్చునే శిక్ష వేయడంతో పాటు రూ.1 వెయ్యి జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయకుండా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష విధించడం జరిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.