FbTelugu

మైనర్ బాలికతో సహజీవనం: హైకోర్టు ఓకె

చండీగఢ్: మైనరిటి కూడా తీరని బాలికతో ప్రేమికుడు సహజీవనం చేసేందుకు పంజాబ్-హర్యానా హైకోర్టు ఓకె చెప్పింది. సహజీవనం చేయాలని జంట నిర్ణయించుకున్నందున తీర్పులు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది.
వివాహం చేసుకోకుండానే పిటీషనర్లు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు, వారి నిర్ణయంలో హైకోర్టు జోన్యం చేసుకోకూడదని జస్టిస్ సత్ ప్రకాశ్ వ్యాఖ్యానించారు. పంజాబ్ లోని బఠిండాలో నివసించే ఒక జంట వేసిన వేసిన పిటీషన్ పై జడ్జి పై విధంగా తీర్పునిచ్చారు.

మైనారిటి కూడా తీరన ఒక యువతి (17), 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. బాలికకు మరో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సమాయత్తం కాగా, జంట కోర్టును ఆశ్రయించింది. తల్లిదండ్రుల ప్రయత్నాలు తెలిసి ఇళ్లు విడిచి ప్రేమికుడి వద్దకు చేరుకున్నానని, రక్షణ కల్పించాలని వేడుకున్నది. బాలిక మైనరిటీ తీరకపోవడంతో 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు సహజీవనం చేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో జంటకు రక్షణ కల్పించడం మా బాధ్యత అని హైకోర్టు జడ్జి జస్టిస్ సంత్ ప్రకాశ్ వ్యాఖ్యానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.