అమరావతి: ఏపీలో యధావిధిగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని, ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం సింగిల్ జడ్జి స్టే కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది.
తాజా తీర్పుతో రాష్ట్రంలో రేపే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ను ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. మంగళవారం సింగిల్ జడ్జి తీర్పుపై అదే రోజు రాత్రి ఎస్ఈసి, రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాయి. వాదోపవాదనల తరువాత ఇవాళ మధ్యాహ్నం పరిషత్ ఎన్నికలకు ఇవాళ డివిజన్ బెంచ్ పచ్చజెండా ఊపింది. దీంతో పరిషత్ పోలింగ్ కు అడ్డంకులు తొలగాయి. సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు.