FbTelugu

నెట్ కర్ఫ్యూ సరిపోతుందా?: హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారని చెబుతున్నారు, రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తే సరిపోతుందా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మల్టీఫ్లెక్స్లు, సినిమా థియేటర్లు, వైన్ షాపులు, బార్లు, పబ్బులు ఆంక్షలు ఎందుకు పెట్టడం లేదని మండిపడింది.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఆంక్షలు ఉన్నప్పుడు వీటికి ఎందుకు లేవని హైకోర్టు లేవనెత్తింది. రాష్ట్రంలో కరోనా లెక్కలపై ప్రభుత్వానివి కాకి లెక్కలనే ఆరోపణలు ఉన్నాయని అన్నది. దేశంలో రెండో దశ పొంచి ఉన్నదనే విషయం తెలిసి కూడా ఎందుకు ముందుగానే సిద్ధంకాలేదని అడిగింది. సెకండ్ వేవ్ విజృంభణ తరువాత మేల్కొంటారా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏప్రిల్ 1 నుంచి 21వ తేదీ వరకు 16.64 లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. 16.17 లక్షలు ర్యాపిడ్ పరీక్షలు, 3.47 లక్షలు ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఇంకా ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు పెంచలేదా, ఎప్పుడు పెంచుతారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.